అవిశ్వాసం.. అంతా ఓ డ్రామా! | No Confidence Motion Is A Drama Says YSRCP Seniors | Sakshi
Sakshi News home page

Jul 20 2018 11:11 AM | Updated on Oct 17 2018 6:18 PM

No Confidence Motion Is A Drama Says YSRCP Seniors - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రజలను తప్పుదోవ పట్టించడానికే టీపీడీ విశ్వాస తీర్మానాన్ని తెరపైకి తెచ్చిందని మాజీ ఎంపీ, వైఎస్సార్‌ సీపీ నేత వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. శుక్రవారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీజేపీ-టీడీపీలు ఇంకా లోపాయికారిగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ‘బీజేపీ, టీడీపీ తీరు హాస్యాస్పదంగా ఉంది. ప్రజలను మరోసారి మోసం చేసుందుకు కుట్ర చేస్తున్నారు. అవిశ్వాస తీర్మానం.. అంతా ఓ డ్రామా!. ప్రజలు వాళ్లకి సరైన బుద్ధి చెప్తారు’ అని సుబ్బారెడ్డి పేర్కొన్నారు. 

బీజేపీ-టీడీపీలది కుమ్మక్కు రాజకీయాలని వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు తెలిపారు. ‘లోక్‌సభలో 13సార్లు వైఎస్సార్‌ సీపీ అవిశ్వాస తీర్మానం నోటీసులు ఇచ్చినా చర్చకు రాలేదు. కానీ, టీడీపీ అవిశ్వాసంపై చర్చకు అనుమతిచ్చారు. వైఎస్సార్‌ సీపీ సభలో లేదుగనుకే బీజేపీ-టీడీపీలు డ్రామాలాడుతున్నాయి’ అని ఉమ్మారెడ్డి ఆక్షేపించారు. 

Advertisement
 
Advertisement
Advertisement