శవపేటికలో ఉన్న టీడీపీకి... | Nallu Indrasena Reddy Criticises Congress TDP Alliance | Sakshi
Sakshi News home page

శవపేటికలో ఉన్న టీడీపీకి...

Nov 14 2018 3:38 PM | Updated on Mar 18 2019 9:02 PM

Nallu Indrasena Reddy Criticises Congress TDP Alliance - Sakshi

కలర్‌ బాగాలేదని కాన్వాయ్‌ మార్చుకున్న కేసీఆర్‌...

సాక్షి, హైదరాబాద్‌ : కేసీఆర్ అరాచక పాలన కారణంగా మిగులు బడ్జెట్‌తో ఉన్న తెలంగాణ అప్పుల్లో కూరుకుపోయిందని బీజేపీ సీనియర్‌ నాయకులు నల్లు ఇంద్రసేనా రెడ్డి అన్నారు. రాష్ట్ర ఖజానాలో చిల్లి గవ్వ కూడా లేకుండా చేసిన ఘనత కూడా కేసీఆర్‌కే దక్కుతుందని ఎద్దేవా చేశారు. బుధవారం విలేకరులతో మాట్లాడుతూ... టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజల సొమ్మును నాలుగన్నరేళ్లుగా దుబారా చేస్తోందని విమర్శించారు. కలర్‌ బాగాలేదని కాన్వాయ్‌ మార్చుకున్న కేసీఆర్‌ కారణంగా హాస్టల్‌ విద్యార్థులకు అన్నం పెట్టేందుకు కూడా డబ్బులు లేని దుస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఇచ్చిన చెక్కులు బౌన్స్‌ అవుతున్నాయంటే పరిస్థితి ఎలా తయారైందో అర్థం చేసుకోవచ్చన్నారు. రాష్ట్రంలోని పరిస్థితులు బాగుపడాలంటే అది కేవలం బీజేపీతోనే సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

కాంగ్రెస్, టీఆర్ఎస్ రెండూ ఒకే గూటి పక్షులని ఇంద్రసేనా రెడ్డి వ్యాఖ్యానించారు. శవపేటికలో ఉన్న టీడీపీకి కాంగ్రెస్‌ ఎందుకు జీవం పోస్తుందో చెప్పాలని ప్రశ్నించారు. అనైతిక పొత్తులతో ఏర్పడిన కూటమిని ప్రజలు అంగీకరించరని ఆయన పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement