కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు | Mp vinoth kumar commented over congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదు

Mar 29 2018 2:38 AM | Updated on Mar 18 2019 9:02 PM

Mp vinoth kumar commented over congress - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: తెలం గాణలో వివిధ సామా జిక వర్గాలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్‌కు చిత్తశుద్ధి లేదని టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ కుమార్‌ అన్నారు. రిజర్వేషన్లు పెంచుకునే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు కల్పించాలంటూ పార్లమెంట్‌లో తాము చేస్తున్న ఆందోళనకు ఆ పార్టీనుంచి కనీస స్పందన లేదన్నారు.

పార్లమెంటు వద్ద బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..ఏపీకి ప్రత్యేక హోదాపై సభలో సహకరిస్తున్న కాంగ్రెస్‌ తెలంగాణలో రిజర్వేషన్ల పెంపుపై తమకు ఎందుకు మద్దతివ్వడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పూటకోమాట మాట్లాడుతోందన్నారు. రిజర్వేషన్ల పెంపునకు కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపితే..కేంద్ర హోం శాఖ అడ్డుపడుతోందని మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement