లోక్‌సభ స్పీకర్‌ స్థానంలో ఎంపీ మిథున్‌రెడ్డి

MP Mithun Reddy In Speaker Chair Holds Lok Sabha As Panel Speaker - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి ప్యానల్ స్పీకర్ హోదాలో లోక్‌సభ నిర్వహి‍ంచారు. లోక్‌సభ స్పీకర్ స్థానంలో ఆసీనులైన ఆయన.. గురువారం ఆధార్ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా సభకు అధ్యక్షత వహించారు. స్పీకర్‌, డిప్యూటీ స్పీకర్‌ సభకు హాజరుకాలేని సమయంలో ప్యానల్‌ స్పీకర్‌ లోక్‌సభ కార్యకలాపాలను నిర్వహిస్తారన్న సంగతి తెలిసిందే.

కాగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ లోక్‌సభ పక్షనేత మిథున్‌రెడ్డి ఇటీవలే లోక్‌సభ ప్యానల్‌ స్పీకర్‌గా నియమితులైన విషయం విదితమే. ఈ మేరకు లోక్‌సభ స్పీకర్‌ ఓంబిర్లా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇక సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా రాజంపేట లోక్‌సభ నియోజకవర్గం నుంచి మిథున్‌రెడ్డి వరుసగా రెండో సారి విజయం సాధించిన సంగతి తెలిసిందే. 2014లో తొలిసారిగా బీజేపీ అభ్యర్థి దగ్గుబాటి పురందేశ్వరిపై విజయం సాధించిన ఆయన.. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సత్యప్రభపై 2,68,284 ఓట్ల భారీ మెజారిటీతో గెలుపొందారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top