‘లోకేష్‌కు దోచిపెట్టడానికే సరిపోయింది’ | MP Margani Bharath Comments On Chandrababu | Sakshi
Sakshi News home page

‘లోకేష్‌కు దోచిపెట్టడానికే సరిపోయింది’

Dec 1 2019 1:08 PM | Updated on Dec 1 2019 7:09 PM

MP Margani Bharath Comments On Chandrababu - Sakshi

సాక్షి, రాజమండ్రి: ఆరు నెలల లోపే ఇచ్చిన హామీలన్నీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేశారని ఎంపీ మార్గాని భరత్‌రామ్‌ అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేరళ తరహాలో నీరా డ్రింక్‌ తయారీపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. ప్రత్యేక హోదా, విభజన హామీలు నెరవేర్చాలని కేంద్రాన్ని కోరామన్నారు. ఇసుక ఆన్‌లైన్‌లో మాత్రమే బుక్‌ చేసుకోవాలని.. నేరుగా డబ్బులు కట్టి తీసుకెళ్తే నేరమని తెలిపారు. సీఎం వైఎస్‌ జగన్‌ చేస్తోన్న సంక్షేమాన్ని చూసి ఓర్వలేకనే ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు పాలనలో లోకేష్‌కు దోచిపెట్టడమే సరిపోయిందని మార్గాని భరత్‌ మండిపడ్డారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement