'చంద్రబాబు.. రాయయలసీమ ద్రోహి'

Mohammad Iqbal Comments About Chandrababu In Anantapur - Sakshi

సాక్షి, అనంతపురం : మూడు రాజధానులు, పరిపాలన- అభివృద్ధి వికేంద్రీకరణ, మూడు ప్రాంతాల్లో అభివృద్ధి సమానంగా జరగాలంటూ హిందూపురం ఆర్‌ అండ్‌ బీ బంగ్లా నుంచి అంబేద్కర్‌ సర్కిల్‌ వరకు భారీ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ షేక్‌ మహ్మద్‌ ఇక్బాల్‌, వైఎస్సార్‌సీపీ పార్టీ శ్రేణులు, విద్యార్థులు, మహిళలు, ప్రజాసంఘాలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మహ్మద్‌ ఇక్బాల్‌ మాట్లాడుతూ.. రాయలసీమలో పుట్టి సీమ అభివృద్ధికి ఏమాత్రం ఇష్టం చూపని చంద్రబాబు రాయలసీమ ద్రోహీ అని మండిపడ్డారు. గడిచిన ఐదేళ్లలో రాయలసీమలో కుప్పంతో సహా ఏ ప్రాంతం అభివృద్ధికి నోచుకోలేదని ఎద్దేవా చేశారు. అమరావతి విషయంలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడి కేసులు పెడతారేమోనని భయపడి ప్రజలను మభ్యపెట్టి తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. గత ఐదేళ్లలో రాజధాని పేరుతో రూ.5600 కోట్లు పెట్టి  లీకు బిల్డింగులు కట్టాడని,  కానీ అమ్మ ఒడి పథకం ద్వారా రూ. 6వేల కోట్లతో వైఎస్‌ జగన్‌ ప్రజలకు మరింత చేరువయ్యారని తెలిపారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top