‘మోదీకి మానసిక వైద్యం ఎంతో అవసరం’

Modi Lose Mental Balance Fires Chhattisgarh CM - Sakshi

మోదీకి మతిభ్రమించింది: ఛత్తీస్‌గఢ్‌ సీఎం

రాయ్‌పూర్‌: మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ నంబర్ వన్ అవినీతి పరుడు అంటూ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై రాజకీయ వర్గాల్లో పెద్ద దుమారమే చెలరేగుతోంది. మోదీ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ నేతలు తీవ్రంగా మండిపడుతున్నారు. తాజాగా ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేష్ బాఘేల్ స్పందిస్తూ.. మోదీపై తీవ్ర స్థాయిలో ఆ‍గ్రహం వ్యక్తం చేశారు. సరిగ్గా నిద్రలేకపోవడం మూలంగా మోదీకి మతిభ్రమించిందని, వెంటనే ఆయన్ని మానసిక వైద్యుడి దగ్గరకు తీసుకెళ్లాలని బాఘేల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మోదీ రోజుకు మూడు, నాలుగు గంటలే నిద్రపోతున్నారని అందుకే ఆయనకు ఆ పరిస్థితి ఏర్పడిందన్నారు.  

కాగా మోదీపై కొద్ది రోజులుగా తీవ్ర విమర్శలు చేస్తున్న భూపేష్ బాఘేల్.. తన మాటల యుద్ధాన్ని కొనసాగిస్తునే ఉన్నారు. సరిగా నిద్రపోనివారు మానసిక అనారోగ్యానికి గురవుతుంటారని, మోదీకి కూడా అలాంటి జబ్బే వచ్చిందని పేర్కొన్నారు. మోదీని మంచి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స అందించాల్సిన అవసరం ఎంతో ఉందన్నారు. రాజీవ్ గాంధీ చనిపోయి చాలా ఏళ్లైందని.. ఆయన గురించి ఇప్పుడు మాట్లాడటమేంటని బాఘెల్‌ ప్రశ్నించారు.

రాజీవ్‌ హయాంలో ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలను మోదీ మర్చిపోవడం దారుణమన్నారు. ఆయన పాలనలో  ఎన్నో విప్లవాత్మక నిర్ణయాలను తీసుకున్నారని గుర్తుచేశారు. కాగా మే 4న ఉత్తరప్రదేశ్‌లో నిర్వహించిన ఎన్నికల ప్రచార ర్యాలీలో నరేంద్రమోదీ మాట్లాడుతూ ‘‘ రాజీవ్‌ గాంధీ మిస్టర్ క్లీన్‌గా దేశ రాజకీయాల్లో వచ్చారు. కానీ నంబర్ వన్ అవినీతి పరుడిగా జీవితం ముగించారు’’ అని సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top