బాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారు..  | MLA Roja Fires On CM Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

బాబు మతి భ్రమించి మాట్లాడుతున్నారు.. 

May 11 2018 3:07 PM | Updated on Oct 29 2018 8:10 PM

MLA Roja Fires On CM Chandrababu Naidu - Sakshi

ఎమ్మెల్యే రోజా

సాక్షి, పుత్తూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏం మాట్లాడుతున్నాడో తనకే తెలియడం లేదని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా ధ్వజమెత్తారు. శుక్రవారం జిల్లాలోని పుత్తూరులో వైఎస్సార్‌సీపీ బూత్‌ కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు మానసిక స్థితి సరిగాలేదని.. అందుకే నిన్న(మే10) ప్రెస్‌ మీట్‌లో ప్రతిపక్ష నాయకులు అధికారంలో ఉన్నప్పుడు ఏమి చేశారు అనడాన్ని బట్టే అర్థమౌతుందన్నారు.

మేము ఎప్పుడు అధికారంలో ఉన్నామో చెప్పాలని ప్రశ్నించారు.. బాబు మతి భ్రమంచి మాట్లాడుతున్నారని ఎమ్మెల్యే రోజా విమర్శించారు. అందుకే ఏంమాట్లాడుతున్నాడో తనకే తెలియడం లేదన్నారు. నాలుగు సంవత్సరాలు బీజేపీతో పొత్తు పెట్టుకుని అన్నీ పదవులు అనుభవించారు. నేడు తన బినామీ ఏపీ ఎన్జీఓతో కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేయండని చెప్పించి ఆ తర్వాత లేదని అనడాన్ని బట్టే అర్థమవుతుందన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రిని అమరావతికి పిలిపించి 36 రకాల వంటలు వడ్డించి మన్ననలు పోందటానికి చిన్న చంద్రబాబు ప్రయత్నించారని ఎమ్మెల్యే రోజా విమర్శంచారు.

Advertisement
 
Advertisement
Advertisement