సినీ ఇండస్ట్రీని భ్రష్టు పట్టించడానికి చంద్రబాబు కుట్ర | MLA Roja Fires On Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘పవన్‌ స్పందనను తప్పుపట్టడం దారుణం’

Apr 21 2018 4:52 PM | Updated on Oct 29 2018 8:08 PM

MLA Roja Fires On Chandrababu Naidu - Sakshi

ఎమ్మెల్యే ఆర్కే రోజా

సాక్షి, తిరుపతి : తన తల్లి మీద చేసిన వ్యాఖ్యలపై పవన్‌ కల్యాణ్‌ స్పందించడాన్ని ముఖ్యమంత్రి  చంద్రబాబు తప్పుపట్టడం దారుణమని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా అన్నారు. ఆమె శనివారం  చిత్తూరు జిల్లా పుత్తూరులో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ..తెలుగు సినిమా ఇండస్ట్రీని భ్రష్టు పట్టించడానికి చంద్రబాబు కుట్ర పన్నారని ఆరోపించారు. ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకొని ఇండస్ట్రీని బద్నామ్‌ చేయిస్తున్నారని ధ్వజమెత్తారు. ఇన్ని రోజులు హోదా రాకుండా చేసి ఇప్పుడు చంద్రబాబు ​దొం‍గ దీక్ష చేశారని ఎద్దేవా చేశారు. బాబు దీక్ష సందర్భంగా మోదీపై బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అభ్యంతరకరంగా ఉన్నాయని ఎమ్మెల్యే రోజా పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement