రాయ్‌బరేలీ ఎమ్మెల్యేతో రాహుల్‌ గాంధీ పెళ్లి!

MLA Aditi Singh Reacts On Marriage Rumours with Rahul Gandhi - Sakshi

రాయ్‌బరేలీ: సొంత పార్టీకే చెందిన యువ ఎమ్మెల్యేతో కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ వివాహం ఖరారైందంటూ నకిలీ వార్తలు గుప్పుమన్నాయి. రాయ్‌బరేలీ ఎమ్మెల్యే అదితి సింగ్‌, రాహుల్‌ల పెళ్లికి ఇరుకుటుంబాలు అంగీకరించాయని, మే నెలలోనే పెళ్లి తంతు పూర్తవుతుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో కీలకమైన కర్ణాటక ఎన్నికల పోలింగ్‌ ఉండనుండటంతో రాజకీయం వర్గాల్లోనూ ఈ వ్యవహారం చర్చనీయాంశమైంది. కాగా, పెళ్లి పుకార్లపై ఎమ్మెల్యే అదితి ఘాటుగా స్పందించారు.

నేను రాఖీ కట్టే అన్నయ్య: ‘‘రాహుల్‌ గాంధీ నాకు పెద్దన్నలాంటి వారు. రాఖీ కూడా కడతాను. అలాంటిది మా ఇద్దరికీ పెళ్లా? అసలు ఇలాంటి ప్రచారం సాగడం నిజంగా బాధాకరం. సోషల్‌ మీడియాలో తప్పుడు సమాచారం చూసినప్పుడు మనసుకు కష్టంగా అనిపిస్తుంది’’ అని ఎమ్మెల్యే అదితి సింగ్‌ మీడియాతో అన్నారు.

ప్రియాంకకు చాలా క్లోజ్‌: ఉత్తరప్రదేశ్‌ రాజకీయాల్లో 29 ఏళ్ల అదితి సింగ్‌ది ప్రత్యేక స్థానం. అమెరికాలోని డ్యూక్‌ యూనివర్సిటీలో మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌ పూర్తిచేసిన ఆమె అనూహ్యరీతిలో రాజకీయరంగప్రవేశం చేశారు. 2017 యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ కంచుకోట రాయ్‌బరేలి నుంచి 90వేల పైచిలుకు మెజారిటీతో విజయం సాధించారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే అదితి.. రాహుల్‌ సోదరి ప్రియాంకతో చాలా సన్నిహితంగా మెలుగుతారు. రాయ్‌బరేలి స్థానం నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన అఖిలేశ్‌ సింగ్‌ కూతురే అదితి సింగ్‌.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top