అవినీతికి.. నిజాయితీకి ఇదీ తేడా

Minister Perni Nani Says We wIll Prove Chandrababu Corruption - Sakshi

వందిమాగధులతో కలిసి ప్రజాధనాన్ని దోచేసిన చంద్రబాబు 

వైఎస్‌ జగన్‌ పాలనలో రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా ఇప్పటికే రూ.2,200 కోట్లు ఆదా

భోగాపురం ఎయిర్‌పోర్టులో రూ.1,500 కోట్లు ఆదా

కర్నూలు ఐఆర్‌ఈపీలో సర్కార్‌కు అదనంగా రూ.5 వేల కోట్ల ఆదాయం

బాబు కోరుకున్నట్లే ఫైబర్‌ గ్రిడ్, చంద్రన్న కానుకల్లో అవినీతిని నిరూపిస్తాం.. 

సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని నాని

సాక్షి, అమరావతి : ప్రజల సంక్షేమమే పరమావధిగా పనిచేసే సీఎం వైఎస్‌ జగన్‌ ప్రభుత్వానికి, వందిమాగధుల అభ్యున్నతే లక్ష్యంగా వ్యవహరించిన చంద్రబాబు సర్కార్‌కూ వ్యత్యాసం కళ్లకు కట్టినట్లు కనిపిస్తోందని మంత్రి పేర్ని నాని చెప్పారు. గురువారం మంత్రివర్గ భేటీ ముగిశాక విలేకరులతో మాట్లాడారు. 

టీడీపీ సర్కార్‌ హయాంలో నీటిపారుదల ప్రాజెక్టుల్లో అవినీతి రాజ్యమేలింది. వైఎస్సార్‌సీపీ సర్కార్‌ అధికారంలోకి వచ్చాక.. చంద్రబాబు హయాంలో కట్టబెట్టిన నీటిపారుదల ప్రాజెక్టుల పనులకు రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహిస్తే రూ.2,200 కోట్లు ఖజానాకు ఆదా అయింది.
భోగాపురం ఎయిర్‌పోర్టులో రూ.1,500 కోట్ల విలువైన 500 ఎకరాల భూమిని సర్కార్‌ ఆస్తిగా మిగిల్చాం. కర్నూలు జిల్లాలో ఇంటిగ్రేటెడ్‌ రెన్యూవబుల్‌ ఎనర్జీ ప్రాజెక్టులో సర్కార్‌కు అదనంగా రూ.4వేల కోట్ల నుంచి రూ.5 వేల కోట్ల ఆదాయం వచ్చేలా చేశాం.
ఫైబర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టు పనులను చంద్రబాబు తన సన్నిహితుడు, ఈవీఎంల దొంగ అయిన వేమూరు హరికృష్ణకు చెందిన టెరాసాఫ్ట్‌కు నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టారు. ఈ వ్యవహారంలో రూ.200 కోట్ల అవినీతి జరిగిందని కేబినెట్‌ సబ్‌ కమిటీ తేల్చింది. 
చంద్రన్న సంక్రాంతి కానుక, రంజాన్‌ తోఫా, క్రిస్మస్‌ కానుకల కింద అధిక ధరలకు నాసిరకం సరుకులు, హెరిటేజ్‌ నుంచి నెయ్యి కొనుగోలు చేసి.. రూ.150 కోట్లు దోచుకున్నట్లు కేబినెట్‌ సబ్‌ కమిటీ తేల్చింది. 
తన సర్కార్‌ అక్రమాలకు పాల్పడి ఉంటే నిరూపించాలని చంద్రబాబు డిమాండ్‌ చేశారు. రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై సిట్‌ వేస్తే కక్ష సాధింపులకు దిగుతున్నారని ఆరోపిస్తున్నారు. చంద్రబాబూ.. నువ్వు కోరుకున్నట్లే.. ఫైబర్‌ గ్రిడ్, చంద్రన్న సంక్రాంతి కానుక, రంజాన్‌ తోఫా, క్రిస్మస్‌ కానుక, హెరిటేజ్‌ మజ్జిగ సరఫరా అక్రమాలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశిస్తూ కేబినెట్‌ నిర్ణయం తీసుకుంది. ఇది కక్ష సాధింపు కాదు.

చదవండి : చంద్రన్న గోల్‌మాల్‌పై సీబీఐ

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top