కందుల కొనుగోళ్లలో ప్రభుత్వాల నిర్లక్ష్యం | mallu ravi on kandi purchases | Sakshi
Sakshi News home page

కందుల కొనుగోళ్లలో ప్రభుత్వాల నిర్లక్ష్యం

Feb 14 2018 3:48 AM | Updated on Feb 14 2018 3:48 AM

mallu ravi on kandi purchases - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కంది కొనుగోళ్లలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరి కారణంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి మంగళవారం మండిపడ్డారు. రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్‌ల్లో ఉన్న కొనుగోలు కేంద్రాల మూసివేతపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

పాలకుల నిర్లక్ష్యం వల్ల కంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు తమ దుర్మార్గపు చర్యలను మానుకుని రైతులను ఆదుకోవాలని కోరారు.

Advertisement
 
Advertisement
Advertisement