కేసీఆర్‌ ముందే సర్వేచేయించుకుండు | Komatireddy Venkat Reddy Slams CM KCR over surve | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ ముందే సర్వేచేయించుకుండు

Dec 6 2018 5:58 AM | Updated on Dec 6 2018 6:42 AM

Komatireddy Venkat Reddy Slams CM KCR over surve - Sakshi

నల్లగొండ: కేసీఆర్‌ నల్లగొండలో ముందే సర్వే చేయించుకొని ఓడిపోతానని తెలిసి ఒక బకరాకు టికెట్‌ ఇచ్చి అప్పుల పాలు చేశారని కాంగ్రెస్‌ నల్లగొండ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన నల్లగొండలో ఎన్నికల ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ, కేసీఆర్‌ మాయ మాటలతో తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు. మొదట దళితుడిని సీఎం చేస్తానని చెప్పి తనే íసీఎం అయి మొదటిమోసం చేశారని ఆరోపించారు. గత ఎన్నికల ముందు నల్లగొండ బహిరంగ సభలో ప్రాజెక్టులన్నీ కుర్చీవేసుకొని కట్టిస్తానని చెప్పి నాలుగేళ్లు గాలికి వదిలారన్నారు.

మళ్లీ ఎన్నికలు రావడం తో ఇప్పుడు ‘నల్లగొండను దత్తత తీసుకుంటా ను, ఇక్కడ ఒకరోజు పండుకొని అయినా పను లు మంజూరు చేయిస్తా’ అంటున్నారని ఎద్దేవా చేశారు. ఇన్నాళ్లు అధికారంలో ఉండి ఏం చేశారని కేసీఆర్‌నుద్దేశించి ప్రశ్నించారు. తెలంగాణ కోసం మంత్రి పదవికి రాజీనామా చేసి 11 రోజు లు నిరాహార దీక్ష చేశానని చెప్పారు. వచ్చేది కాంగ్రెస్‌ ప్రభుత్వమని, అవినీతికి పాల్పడ్డ కేసీఆర్‌ జైలుకు పోక తప్పదని అన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement