‘స్కూలు బస్సులకు అనుమతిస్తే కేసులేస్తాం’

Kodandaram Warns Government On School Buses Permission - Sakshi

టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం హెచ్చరిక

ప్రగతి నివేదన సభకు నిబంధనల మేరకే అనుమతివ్వాలి

సాక్షి, హైదరాబాద్‌: ‘మా పార్టీ కార్యక్రమం కోసం అడిగితే నిబంధనల ప్రకారం స్కూలు బస్సులు ఇవ్వడం కుదరదన్నారు. అందుకే ఇపుడు లోతుగా పరిశీలించి చూస్తాం. టీఆర్‌ఎస్‌ సభ కోసం స్కూలు బస్సులకు అనుమతి ఇస్తే ఊరుకునేది లేదు. ఏ అధికారి అధికార దుర్వినియోగానికి పాల్పడినా కోర్టులో కేసులేస్తాం’అని టీజేఎస్‌ అధ్యక్షుడు కోదండరాం హెచ్చరించారు. వచ్చే నెల 2న టీఆర్‌ఎస్‌ నిర్వహిస్తున్న ప్రగతి నివేదన సభకు నిబంధనల మేరకే అనుమతులివ్వాలని డిమాండ్‌ చేశారు. మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి మనవడు, మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి కుమారుడు, పీసీసీ కార్యదర్శి ఆదిత్యరెడ్డి.. పారి శ్రామికవేత్త బాలలింగం ఆదివారం టీజేఎస్‌లో చేరారు.

నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమం లో పార్టీ అధ్యక్షుడు కోదండరాం వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. సభలు, సమావేశాలు నిర్వహించే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, అధికార దుర్వినియోగం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత గవ ర్నర్‌దేనన్నారు. ఉచితంగా ఆర్టీసీ బస్సులు పంపుతాం.. డయాస్‌ వేస్తాం.. ఫుడ్‌ సప్లై చేస్తాం అనేవి ఉండొద్దని, అలాంటివి జరిగితే ఊరుకోమన్నారు. గతంలో తమ సభకు ఆటంకాలు సృష్టించారని, టీఆర్‌ఎస్‌ సభకు అలాంటి ఇబ్బందు లు సృష్టించొద్దన్నారు. ప్రస్తుత రాజకీయాల్లో యువ కుల అవసరం ఉందని.. సేవా దృక్పథంతో రాజకీయాల్లోకి రావాలని కోదండరాం పిలుపునిచ్చారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top