చేతకాక మధ్యలోనే అధికారాన్ని వదిలేశారు

Kodandaram commented over trs - Sakshi

టీజేఎస్‌ అధినేత కోదండరాం ధ్వజం

టీజేఎస్‌లోఅడ్వొకేట్‌ రచనారెడ్డి చేరిక

సాక్షి, హైదరాబాద్‌: ఐదేళ్లు పాలించాలని ప్రజలు అధికారమిస్తే, ప్రజాసమస్యలను పరిష్కరించడం చేతకాక కె.చంద్రశేఖర్‌రావు మధ్యలోనే దిగిపోయారని తెలంగాణ జన సమితి(టీజేఎస్‌) అధ్యక్షుడు ప్రొఫెసర్‌ ఎం.కోదండరాం వ్యాఖ్యానించారు. మాజీ ఎమ్మెల్సీ కె.దిలీప్‌కుమార్‌తో కలసి పార్టీ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడు తూ ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్‌ పెద్ద అవివేకి అని విమర్శించారు. ఇంత చెత్త ఆలోచనను కేసీఆర్‌ ఎందుకు చేశారోనని కోదండరాం అన్నారు.

టీఆర్‌ఎస్‌ పాలనలో ప్రజల గోడు వినేవారు కరువయ్యారన్నారు. ప్రత్యేక రాష్ట్రం వల్ల బాగుపడింది కేవ లం కేసీఆర్‌ కుటుంబమేనని ఆరోపించారు. పైసలిచ్చేవాడుకాదు, పనిచేసేవాడు కావాలని ప్రజలు భావిస్తున్నారని చెప్పారు.  అప్పట్లో తెలంగాణవాదు లు, యువత, విద్యార్థులు, ఉద్యోగులు టీఆర్‌ఎస్‌ అంటే తమపార్టీ అనుకునేవారని, ఇప్పుడేమో కేసీఆర్, ఆయన కుటుంబసభ్యుల పార్టీ అని భావిస్తు న్నారని చెప్పారు. కేసీఆర్‌ తన ఒక్కరికే సొంతరాష్ట్రం వచ్చిం దని అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.  

ఉద్యమ ఆకాంక్షలకు అనుగుణంగానే పొత్తులు
తెలంగాణ వస్తే తమ బతుకులు బాగుపడతాయని ప్రజలు కలలు కన్నారని, అవి కల్లలు అయ్యాయని కోదండరాం ఆవేదన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ కుటుంబపాలన చేసి తెలంగాణను ఆగమాగం చేశారన్నారు. కేసీఆర్‌ కుటుంబం సంతోషంగా ఉంటే బం గారు తెలంగాణ తయారైనట్టేనా.. అని ప్రశ్నించారు. విశ్వనగరం చేస్తామన్న హైదరాబాద్‌ను విధ్వంసం చేశారని ఆరోపించారు.

ఇంటింటికీ నీళ్లు ఇవ్వకపోతే ఓట్లు అడగనన్న కేసీఆర్, ఇప్పటిదాకా ఎన్ని ఊళ్లకు నీళ్లు ఇచ్చారో, ఎన్ని ఇళ్లకు నీళ్లు వస్తున్నాయో చూపిస్తారా అని సవాల్‌ చేశారు.  యావత్తు తెలంగాణ సమాజం కేసీఆర్‌కు తగిన బుద్ధి చెప్పాలన్నారు.టీజేఎస్‌  లక్ష్యాలు దెబ్బతినేవిధంగా పొత్తులుండవని, ఉద్యమ ఆకాంక్షల సాధనే ఎజెండాగా పొత్తుల వైపు అడుగులు వేస్తామని చెప్పారు.

టీజేఎస్‌లో చేరిన అడ్వకేట్‌ రచనారెడ్డి
ప్రభుత్వం తీసుకున్న పలు చట్టవిరుద్ధమైన నిర్ణయాలపై కోర్టుల్లో పోరాడిన అడ్వకేట్‌ రచనారెడ్డి శుక్రవా రం టీజేఎస్‌లో చేరారు. ‘పార్టీలో చేరిన. ఇక నుంచి కథ వేరేవిధంగా ఉంటుంద’ని టీఆర్‌ఎస్‌ను హెచ్చరించారు.  అనంతరం రచనారెడ్డి, ప్రొ.విశ్వేశ్వర్‌రావు, బకృద్దీన్‌లను టీజేఎస్‌ ఉపాధ్యక్షులుగా నియ మిస్తున్నట్టుగా కోదండరాం ప్రకటించారు.  

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top