టీడీపీలో ‘కోట్ల’ కలకలం.. డిప్యూటీ సీఎం అలక | KE Krishna Murthy Disappointment Over Kotla Family TDP Entry | Sakshi
Sakshi News home page

Jan 28 2019 7:31 PM | Updated on Jan 28 2019 7:57 PM

KE Krishna Murthy Disappointment Over Kotla Family TDP Entry - Sakshi

సాక్షి, కర్నూలు: టీడీపీలోకి మాజీ కేంద్ర మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి కుటుంబం రాకపై డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి అలక వహించారు. కేఈ కృష్ణమూర్తికి సమాచారం లేకుండానే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డికి అపాయింమెంట్‌ ఇచ్చారు. టీడీపీలో కోట్ల కుటుంబం రాకను చాలా కాలంగా వ్యతిరేకిస్తు వస్తున్న కేఈ కృష్ణమూర్తికి ఈ పరిణామాలు మింగుడు పడటం లేదని సమాచారం. ఇప్పటికే కేఈ కృష్ణమూర్తి అధికారాలను కత్తిరించి అవమానించిన చంద్రబాబు.. కోట్ల సూర్యప్రకాశ్‌ రెడ్డిని టీడీపీలో చేర్చుకోవాలని యోచిస్తున్నారు.

మరోవైపు, టీడీపీలోకి కోట్ల రాకపై కేఈ కృష్ణమూర్తి సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. టీడీపీలో కోట్ల కుటుంబం చేరికపై తనకెలాంటి సమాచారం లేదని ఆయన పేర్కొన్నారు. ఈ విషయంలో తనపై వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం లేదని తెలిపారు. రాజకీయంగా తొలి నుంచి కోట్ల కుటుంబంతో పోరాడుతున్న కేఈ కృష్ణమూర్తి వర్గం.. చంద్రబాబు తాజా నిర్ణయంపై తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement