‘ఆయన ఆలోచనలతోనే కేసీఆర్‌ సంస్కరణలు’ | 'KCR reforms with his ideas' | Sakshi
Sakshi News home page

‘ఆయన ఆలోచనలతోనే కేసీఆర్‌ సంస్కరణలు’

Jan 30 2018 4:01 PM | Updated on Jan 30 2018 4:02 PM

'KCR reforms with his ideas' - Sakshi

మంత్రి జగదీశ్‌ రెడ్డి (ఫైల్‌ ఫోటో)

 – మంత్రి జగదీశ్‌ రెడ్డి

ఢిల్లీ : భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేడ్క‌ర్ ఆలోచ‌న‌తో తెలంగాణ సీఎం కేసీఆర్ సంస్క‌ర‌ణ‌లు చేప‌డుతున్నారని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. విలేకరులతో మాట్లాడుతూ..విద్యా, ఆర్థిక ప‌రిస్థితుల‌ను మెరుగు ప‌రిస్తే అంట‌రానిత‌నాన్ని పొగొట్ట‌వ‌చ్చ‌న్న‌దే సీఎం కేసీఆర్ ఆలోచ‌న‌ అని తెలిపారు. ఈ దిశ‌లో రాష్ట్రంలో పెద్ద ఎత్తున దళిత విద్యార్థుల విద్య కోసం సీఎం కేసీఆర్ గురుకులాల‌ను ఏర్పాటు చేస్తున్నారని వెల్లడించారు. పాఠ‌శాలల్లోనూ 7 రోజులు పౌష్టికాహారం అందిస్తున్న రాష్ట్రం ఒక్క తెలంగాణ‌ మాత్రమేనన్నారు. ద‌ళితుల్లో సాధికార‌త సాధించ‌డమే మా ల‌క్ష్యం అని చెప్పారు.

 ఎస్సీ, ఎస్టీల  ర‌క్ష‌ణ‌కై తీసుకుంటున్న చ‌ర్య‌ల్లో తెలంగాణ రాష్ట్రం అగ్ర‌స్థానంలో ఉందన్నారు. ఎస్సీల‌పై జ‌రిగిన దాడుల్లో న‌మోదైన కేసుల ప‌రిష్కారంలో మా ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టి సారించిందని వ్యాఖ్యానించారు. పీసీఆర్ అండ్‌ పీఓఏ చ‌ట్టాల‌ అమ‌లులో తెలంగాణ మొద‌టి వ‌రుస‌లో ఉందన్నారు. 20 శాతం కేసుల‌ను ప‌రిష్క‌రించిన రాష్ట్రం ఒక్క తెలంగాణనే అని అన్నారు. బాధితుల‌కు ఆర్థిక సాయం, కేసుల విచార‌ణ‌కు ప్ర‌త్యేక కోర్టుల‌ను ఏర్పాటు చేశామని చెప్పారు. పాత జిల్లాల ప్రకారం ప్ర‌తి జిల్లాలో ఒక కోర్టు, 9 మొబైల్ కోర్టులను ఏర్పాటు చేసినట్ల మంత్రి జగ‌దీష్ రెడ్డి వెల్లడించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement