ఇంటికో ఉద్యోగం ఇస్తానని కేసీఆర్‌ చెప్పలేదు | Karne prabhakar comments over congress | Sakshi
Sakshi News home page

ఇంటికో ఉద్యోగం ఇస్తానని కేసీఆర్‌ చెప్పలేదు

Oct 21 2018 2:53 AM | Updated on Mar 18 2019 9:02 PM

Karne prabhakar comments over congress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అధికారంలోకి వస్తే ఇంటికో ఉద్యోగం ఇస్తానని కేసీ ఆర్‌ ఎన్నడూ చెప్పలేదని ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, ఎంఎస్‌.ప్రభాకర్‌రావు అన్నారు. శనివారం తెలంగాణ భవన్‌లో కార్పొరేషన్‌ చైర్మన్లు కిషన్‌రావు, రంగారెడ్డిలతో కలిసి వారు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్‌ నేతల మాటలు చూస్తుంటే అబద్ధాల కంటే ముందే వారు పుట్టారనిపిస్తోందన్నారు. నిత్యం కాంగ్రెస్‌ నేతలు చెప్పే అబద్ధాలే రాహుల్‌ గాంధీ చెప్పారన్నారు. వారి ప్రసంగాలను విని ప్రజలు నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఓ పార్టీ అధ్యక్షుడిగా రాహుల్‌కి గౌరవం ఇస్తామని, కానీ ఆ స్థాయిలో ఆయన మాట్లాడలేదన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement