కాంగ్రెస్‌ నిరుద్యోగులను రెచ్చగొడుతోంది: కర్నె | Karne prabhakar commented over congress | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ నిరుద్యోగులను రెచ్చగొడుతోంది: కర్నె

Sep 23 2018 2:52 AM | Updated on Mar 18 2019 9:02 PM

Karne prabhakar commented over congress - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ నిరుద్యోగులను రెచ్చగొడుతోం దని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్‌ అన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి ఉద్యోగులపై ప్రత్యేక శ్రద్ధ ఉందని, కాంగ్రెస్‌ మాత్రం వారిని బానిసలుగా చూస్తోందన్నారు. టీఆర్‌ఎస్‌ కార్యదర్శి గట్టు రాంచందర్‌రావుతో కలిసి ఆయన తెలంగాణ భవన్‌లో శనివారం విలేకరులతో మాట్లాడారు. ఉత్తమ్‌ కుమార్‌ నిరుద్యోగుల పేరుతో కాంగ్రెస్‌ కార్యకర్తల సమావేశం నిర్వహించి పాడిన పాటే పాడారన్నారు.

నిరుద్యోగ సమస్యకు కారణం కాంగ్రెసేనని, నిరుద్యోగులకు ఉద్యోగ భృతి అంటూ వారిని అయోమయంలో పడేస్తోందని విమర్శించారు. కోర్టు కేసులతో కాంగ్రెస్‌ వివాదాలు సృష్టించి ఉద్యోగాలు రాకుండా చేస్తోందని ఇప్పటికైనా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నిరుద్యోగులను రెచ్చగొట్టే వ్యాఖ్యలు మానుకోవాలని హితవు పలికారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చాక ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేశామో ప్రజలకు తెలుసన్నారు. అమలు సాధ్యంకాని హామీలతో ప్రజల్ని కాంగ్రెస్‌ మభ్యపెడుతోందన్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement