‘అందుకే బాబు.. నీ సీటు మారుస్తున్నారు’ | Kanna Lakshmi Narayana Criticize CM Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

‘అందుకే బాబు.. నీ సీటు మారుస్తున్నారు’

May 2 2019 8:53 AM | Updated on May 2 2019 12:07 PM

Kanna Lakshmi Narayana Criticize CM Chandrababu Naidu - Sakshi

సాక్షి, అమరావతి : ప్రధాన మంత్రి నరేంద్రమోదీ యావంతా దుస్తులు మార్చడంపైనే ఉంది కానీ దేశంపై లేదంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ ట్విటర్‌ వేదికగా వ్యంగ్యంగా స్పందించారు. నరేంద్ర మోదీ గంటకో డ్రెస్‌ మారుస్తారో లేదో తెలియదు కానీ చంద్రబాబు మాత్రం ఊసరవెల్లి కంటే ఘోరంగా రంగులు మారుస్తారని ఎద్దేవా చేశారు. నిమిషానికో మాట మారస్తూ నిజాయితీగా ఉన్న అధికారుల సీటు మారుస్తారని ఆరోపించారు. ఎమ్మెల్యేలను కొని వాళ్ల పార్టీ మార్చారని, అందుకే ఈ ఎన్నికల్లో ప్రజలు చంద్రబాబు సీటుని మారుస్తున్నారని ట్విట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement