వైఎస్‌ఆర్‌సీపీపై టీడీపీ విమర్శలు విడ్డూరం | k rama krishna on tdp | Sakshi
Sakshi News home page

వైఎస్‌ఆర్‌సీపీపై టీడీపీ విమర్శలు విడ్డూరం

Feb 16 2018 2:46 AM | Updated on May 29 2018 4:40 PM

తిరుపతి కల్చరల్‌ : ప్రత్యేక హోదా కోసం వచ్చే ఏప్రిల్‌లో ప్రతిపక్ష వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీలు రాజీనామా చేస్తారని ఆ పార్టీ ప్రకటిస్తే.. అది రాజకీయ నాటకమంటూ తెలుగుదేశం పార్టీ నేతలు స్పందించడం విడ్డూరమని, అసలు టీడీపీ ఏం చేస్తుందో స్పష్టం చేయాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె. రామకృష్ణ డిమాండ్‌ చేశారు. తిరుపతిలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు.

ప్రత్యేక హోదా సాధన కోసం, విభజన చట్టంలోని హామీల అమలుకు ప్రతిపక్ష పార్టీలు ఉద్యమిస్తుంటే.. బీజేపీని ప్రశ్నించాల్సిన అధికార పార్టీ నేతలు ప్రతిపక్షాలపై వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. వైఎస్‌ఆర్‌సీపీ ఎంపీల రాజీనామా విషయాన్ని డ్రామా అని చంద్రబాబు చెప్పడం చూస్తే ు మోదీని ఎదిరించే ధైర్యంలేదని తేలిపోయిందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement