నారా లోకేశ్‌కు నిరసన సెగ

Journalists Protest In Front Of Nara Lokesh - Sakshi

సాక్షి, తిరువూరు(కృష్ణా జిల్లా): ఆంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి నారా లోకేశ్‌కు నిరసన సెగ తాకింది. తమకు ఇళ్ల స్థలాలు కేటాయించాలంటూ జర్నలిస్టులు లోకేశ్‌ పాల్గొన్న కార్యక్రమంలో నిరసన తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా తిరువూరు మండలం ముష్టికుంట్లలో సోమవారం జరిగిన జన్మభూమి- మా ఊరు కార్యక్రమంలో లోకేశ్‌ పాల్గొన్నారు.  లోకేశ్‌ పాల్గొన్న వేదిక ముందు బైఠాయించిన జర్నలిస్టులు టీడీపీ ప్రభుత్వం తమకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటూ జర్నలిస్టులు డిమాండ్‌ చేశారు. వెంటనే జర్నలిస్ట్‌ కోటా కింద తమకు స్థలాలు మంజూరు చేసి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని జర్నలిస్టులకు త్రిబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు కేటాయిస్తానని చంద్రబాబు చేసిన వాగ్ధానాన్ని మీడియా ప్రతినిధులు గుర్తుచేశారు. కానీ నేటికి ఇచ్చిన హామీని సీఎం నిలబెట్టుకోలేదని అన్నారు. తిరువూరు తమకు ఇళ్ల స్థలాలు కేటాయించి గృహాలు నిర్మించాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top