మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు

IT raids at ysrcp MP condidate Mudugula Venugopalreddy residence in guntur - Sakshi

సాక్షి, గుంటూరు : గుంటూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్‌ రెడ్డి ఇంటిపై బుధవారం ఐటీ అధికారులు దాడులు చేశారు. ఆయన కార్యాలయంలో పాటు...మోదుగుల చీఫ్‌ ఎలక్షన్‌ ఏజెంట్‌ సుధాకర్‌రెడ్డి నివాసంలోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. దాదాపు గంట నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వేణుగోపాల్‌ రెడ్డి మాట్లాడుతూ... ఐటీ దాడులకు తాను ఏమాత్రం భయపడేది లేదని, దాడులతో తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని స‍్పష్టం చేశారు. పోలింగ్‌కు మరికొద్ది గంటల సమయం ఉందని, భయపెట్టేందుకే ఈ సమయంలో ఐటీ దాడులు చేపట్టారన్నారు. మరోవైపు ఐటీ అధికారులు...మోదుగుల ఎన్నికల ఖర్చుపై ఆరా తీస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top