breaking news
mudugula venugopala reddy
-
మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ఇంటిపై ఐటీ దాడులు
సాక్షి, గుంటూరు : గుంటూరు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఇంటిపై బుధవారం ఐటీ అధికారులు దాడులు చేశారు. ఆయన కార్యాలయంలో పాటు...మోదుగుల చీఫ్ ఎలక్షన్ ఏజెంట్ సుధాకర్‌రెడ్డి నివాసంలోనూ ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారు. దాదాపు గంట నుంచి ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ... ఐటీ దాడులకు తాను ఏమాత్రం భయపడేది లేదని, దాడులతో తన ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరని స్పష్టం చేశారు. పోలింగ్‌కు మరికొద్ది గంటల సమయం ఉందని, భయపెట్టేందుకే ఈ సమయంలో ఐటీ దాడులు చేపట్టారన్నారు. మరోవైపు ఐటీ అధికారులు...మోదుగుల ఎన్నికల ఖర్చుపై ఆరా తీస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
పీఏసీ ఛైర్మన్‌గా భూమా నాగిరెడ్డి
-
పీఏసీ ఛైర్మన్‌గా భూమా నాగిరెడ్డి
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ అకౌంట్స్ కమిటీ ఛైర్మన్‌గా పదవికి వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే భూమా నాగిరెడ్డి ఎంపికయ్యారు. అలాగే పీయూసీ కాగిత వెంకట్రావు, ఎస్టిమేట్ కమిటీ ఛైర్మన్‌గా మోదుగుల వేణుగోపాలరెడ్డి పేర్లు ఖరారు అయ్యాయి. లోక్‌సభ, శాసనసభల్లో పీఏసీ ఛైర్మన్ పదవిని ప్రతిపక్ష పార్టీకి ఇవ్వడం సాంప్రదాయం. దీంతో ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీ అయిన వైఎస్ఆర్ కాంగ్రెస్‌కు ఈ పదవి దక్కింది. పీఏసీ ఛైర్మన్ పదవికి భూమా నాగిరెడ్డి నిన్న నామినేషన్ వేసిన విషయం తెలిసిందే.