ఆటోడ్రైవర్‌ ఇంట్లో ఐటీ సోదాలు

I-T raids on auto driver who owns posh villa - Sakshi

బనశంకరి (బెంగళూరు): పలువురు పారిశ్రామికవేత్తలు, రాజకీయనేతలతో సంబంధాలు కలిగిన ఆటోడ్రైవరు ఇంటిపై ఆదాయపన్ను శాఖ (ఐటీ) అధికారులు దాడులు నిర్వహించారు. బెంగళూరు వైట్‌ఫీల్డ్‌లోని ఒక విల్లాలో సుబ్రమణి అనే ఆటోడ్రైవరు నివాసముంటున్నాడు. ఇతడు పేరుకు మాత్రమే ఆటోడ్రైవరు కాగా పేరుపొందిన రాజకీయనేతలు, పారిశ్రామికవేత్తలతో సన్నిహిత సంబంధాలున్నాయి. రెండురోజుల క్రితం ఐటీ అధికారులు ఇతని విల్లాపై దాడిచేశారు. సోదాల్లో అనేక కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. వాటి ద్వారా పారిశ్రామికవేత్తలు, రాజకీయనేతల బినామీ ఆస్తుల గుట్టు వెలుగుచూసినట్లు తెలిసింది. దీనిపై మహదేవపుర బీజేపీ ఎమ్మెల్యే అరవిందలింబావళి మాట్లాడుతూ సుబ్రమణి పేరుతో బినామీ ఆస్తులుంటే, అతడి ఇంట్లో నగదు లభిస్తే ఐటీ అధికారులు నిర్దాక్షిణ్యంగా చర్యలు తీసుకోవాలన్నారు. సుబ్రమణితో తనకు ముఖ పరిచయం కూడా లేదని చెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top