‘చంద్రబాబు సంజాయిషీ ఇవ్వాల్సిందే’ | GVL Narasimha rao takes on chandrababu naidu | Sakshi
Sakshi News home page

‘చంద్రబాబు సంజాయిషీ ఇవ్వాల్సిందే’

Jul 20 2018 11:19 AM | Updated on Oct 17 2018 6:18 PM

GVL Narasimha rao takes on chandrababu naidu - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  కేంద్రంపై అవిశ్వాస తీర్మానంలో భాగంగా టీడీపీ లేవనెత్తిన ప్రతీ అంశాన్ని తిప్పిగొడతామని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. మళ్లీ ఎన్నికల్లో గెలిచేందుకే బీజేపీపై టీడీపీ బురదజల్లే ప్రయత్నం చేస్తోందని ఆయన విమర్శించారు. ఏపీలో అవినీతి అడ్డగోలుగా జరుగుతోందని జీవీఎల్‌ మండిపడ్డారు. అనేక అంశాలపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

ఈజ్‌ ఆఫ్‌ డుయింగ్‌లో నంబర్‌ వన్‌ అని చెప్పుకున్న బాబు ప్రభుత్వం.. ఈజ్‌ ఆఫ్‌ డుయింగ్‌ కరప్షన్‌లో నంబర్‌ వన్‌ అని చెప్పుకోవాలని జీవీఎల్‌ ఎద్దేవా చేశారు. ప్రత్యేక ప్యాకేజీ వద్దు.. ప‍్రత్యేక హోదా కావాలంటూ చంద్రబాబు మాట తప్పడానికి కేవలం తన రాజకీయ ప్రాధాన్యతే కారణమన్నారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం పట్ల కేంద్రం చూపిన శ్రద్ధను తాము ప్రజలకు చెప్పుకుంటామని ఈ సందర్భంగా జీవీఎల్‌ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement