కేసీఆర్‌, కేటీఆర్‌లకు గుత్తా ధన్యవాదాలు | Gutta Sukhendhar Reddy Thanks To KCR | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌, కేటీఆర్‌లకు గుత్తా ధన్యవాదాలు

Aug 5 2019 12:40 PM | Updated on Aug 5 2019 12:44 PM

Gutta Sukendhar Reddy Thanks To KCR  - Sakshi

సాక్షి, నల్గొండః ఎమ్మెల్సీగా టీఆర్‌ఎస్‌ నుంచి అవకాశం కల్పించినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌కు గుత్తా సుఖేందర్‌రెడ్డి ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, పార్టీ నేతలమంతా పార్టీ అభివృద్ధికి కలిసికట్టుగా పని చేస్తామని తెలిపారు.  ముఖ్యమంత్రి ఆశయాలకు అనుగుణంగా ముందుకు సాగుతామన్నారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో అన్ని మున్సిపాలిటీలు గెలుచుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ సభ్యత్వం అనుకున్న లక్ష్యం కన్నా అధికంగా ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి నేతృత్వంలో జరుగుతుందన్నారు. బీజేపీ.. టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం అనుకోవడం హాస్యాస్పదమని.. పార్లమెంట్ ఎన్నికల్లో నాలుగు స్థానాలు గెలిచినంత మాత్రాన ఒరిగేది ఏమి లేదని.. ఆ తర్వాత అన్ని ఎన్నికలలో అడ్రెస్ లేకుండా పోయిందన్నారు. 7, 10వ తేదీల్లో  నామినేషన్‌ వేస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement