'అప్పుడెందుకు ఫ్యాక్ట‌రీ మూసేయ‌లేదు'

Gudivada Amarnath Questions Chandrababu Over LG Polymers - Sakshi

సాక్షి, విశాఖప‌ట్నం: ప్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు నాయుడు విమ‌ర్శ‌ల‌ను పట్టించుకోవాల్సిన అవ‌స‌రం లేద‌ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, అన‌కాప‌ల్లి ఎమ్మెల్యే గుడివాడ అమ‌ర్‌నాథ్‌ అన్నారు. గ‌తంలో ప్ర‌మాదాల స‌మ‌యంలో బాబు సీఎంగా ఉన్న‌ప్పుడు ఎలా స్పందించారో అంద‌రికీ తెలుస‌ని ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన విశాఖ‌ప‌ట్నంలో మీడియాతో మాట్లాడుతూ.. ఎల్జీ పాలిమ‌ర్స్‌ ఫ్యాక్ట‌రీ వ‌ద్ద సాధార‌ణ ప‌రిస్థితులు కొన‌సాగుతున్నాయ‌ని స్ప‌ష్టం చేశారు. కాగా బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న‌ప్పుడు ఇదే ఫ్యాక్ట‌రీలో1998లో అగ్నిప్రమాదం జరిగింద‌ని, మ‌రి అప్పుడెందుకు మూసేయలేదని ప్ర‌శ్నించారు. (ఆందోళన వద్దు... మీ బాధ్యత మాది)

కేంద్రం అనుమ‌తివ్వ‌కున్నా మీరెలా అనుమ‌తిచ్చారు?
అంతేకాక హెచ్‌పీసీఎల్‌లో ప్ర‌మాదం జరిగిన‌ప్పుడు ఫ్యాక్ట‌రీని త‌ర‌లించాల్సింది క‌దా అని ప్రశ్నించారు. బాబు హ‌యాంలో సింహాచలం భూముల‌ను డీనొటిఫై చేసి మ‌రీ ఎల్జీ పాలిమ‌ర్స్కు అప్పగించింది వాస్త‌వం కాదా? అని సూటిగా ప్ర‌శ్నించారు. కేంద్ర పర్యావరణ అనుమతులు లేకుండా వీటికి మీ హ‌యాంలో ఎలా అనుమతిలిచ్చారని వ‌రుస ప్ర‌శ్న‌లు సంధించారు. వారి నిర్ల‌క్ష్య‌మే ఇప్ప‌టి ప్ర‌మాదానికి కార‌ణ‌మ‌ని మండిప‌డ్డారు. 'చంద్ర‌బాబు హ‌యాంలో ఏం చేసినా అది న్యాయం.. సీఎం వైస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి హ‌యాంలో ఏం చేసినా అన్యాయం అవుతుందా?' అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌ల శ్రేయ‌స్సే త‌మ‌కు అత్యంత‌ ప్రాధాన్య‌మ‌ని ఉద్ఘాటించారు. నిపుణుల సూచనల‌ మేరకే తదుపరి‌ నిర్ణయాలు తీసుకుంటామ‌ని అమ‌ర్‌నాథ్‌ వెల్ల‌డించారు. (‘నేను.. 3 గ్రామాలు.. నా 33 వేల ఎకరాలు’)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top