కార్మికులపై పవన్‌ది కపట ప్రేమ

Gudivada Amarnath comments on Pawan Kalyan - Sakshi

ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ ధ్వజం 

సాక్షి, విశాఖపట్నం: ఎన్నడూ లేనివిధంగా భవన నిర్మాణ కార్మికులపై తెలుగుదేశం పార్టీతో కలిసి జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌  కపటప్రేమ చూపిస్తూ లాంగ్‌మార్చ్‌ చేయడం ఆశ్చర్యంగా ఉందని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్‌ అన్నారు. ఆయన ఆదివారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడారు. లాంగ్‌మార్చ్‌ను పవన్‌ కల్యాణ్‌ వెహికల్‌ మార్చ్‌గా చేపట్టారని ఎద్దేవా చేశారు. గత ఐళ్లుగా ఇసుక మాఫియాకు, డ్రగ్‌ మాఫియాకు బ్రాండ్‌ అంబాసిడర్లయిన అచ్చెన్నాయుడిని, అయ్యన్నపాత్రుడిని పక్కన పెట్టుకుని వేదికపై పవన్‌ నీతులు వల్లిస్తుంటే ప్రజలు ముక్కున వేలేసుకున్నారని చెప్పారు.

రాష్ట్రంలో కొంతమేర ఇసుక కొరత ఉందని, ప్రకృతి వైపరీత్యం కారణంగా ఇసుక కొరత సంభవించిందని పేర్కొన్నారు. అసలు విశాఖలో ఏ నది ఉందని పవన్‌ కల్యాణ్‌ లాంగ్‌మార్చ్‌కి పిలుపునిచ్చారని ప్రశ్నించారు. ప్రభుత్వాన్నికి 15 రోజలు గడువిస్తున్నారంటే.. ఇసుక లభ్యతపై పవన్‌కు అవగాహనే లేదని అర్థమవుతోందన్నారు. గత ఐదేళ్లలో టీడీపీ ప్రభుత్వ అవినీతి, అక్రమాలపై ఏనాడైనా ప్ర«శ్నించావా? అని పవన్‌ కల్యాణ్‌ను నిలదీశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top