కేంద్ర మాజీ మంత్రి ఐడీ స్వామి కన్నుమూత

Former Union Minister ID Swami passes away at 90 - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ నేత ఈశ్వర్ దయాళ్‌ స్వామి (90) కన్నుమూశారు. గుండె జబ్బుతో బాధపడుతున్న ఆయన ఫరీదాబాద్‌లోని ఆసుపత్రిలో ఆదివారం మరణించారు.1929 ఆగస్టు 11న అంబాలా జిల్లాలోని బాబియల్‌లో జన్మించిన ఐడీ స్వామి మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వంలో 1999లో కేంద్రమంత్రిగా పనిచేశారు. స్వామి మరణంపై పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు సంతాపం వెలిబుచ్చారు. హర్యానాలోని కర్నాల్‌కు చెందిన ఆయన రెండుసార్లు లోక్‌సభ సభ్యుడుగా ఎంపికయ్యారు.ఆయనకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కాగా గతవారంమే స్వామి భార‍్య పద్మ కన్నుమూశారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top