ప్రజల్లోనే ఉండండి.. ఐక్యంగా ముందుకెళ్లండి

Finalise seat-sharing with allies, Rahul Gandhi tells TPCC - Sakshi

ఈసారి ఎన్నికలను చాలెంజ్‌గా తీసుకుని పనిచేయండి

ఓటర్ల జాబితాలో అవకతవకలపై ప్రచారం చేయండి

పొత్తు చర్చలను వీలున్నంత త్వరగా కొలిక్కి తెండి

టీపీసీసీ ముఖ్య నేతలకు రాహుల్‌గాంధీ దిశానిర్దేశం

సాక్షి, హైదరాబాద్‌: ఎన్నికల కదనరంగంలో ఎక్కడా వెనకబడొద్దని, నిత్యం ప్రజల్లోనే ఉండి ఐక్యంగా ముందుకెళ్లాలని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ సూచించారు. ఎన్నికలను సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన కార్యాచ రణ రూపొందిచుకోవాలని, ప్రజల మద్దతు పొందేం దుకు ప్రయత్నాలు ముమ్మరం చేయాలన్నారు. ఈ సారి ఎన్నికలను చాలెంజ్‌గా తీసుకోవాలని చెప్పా రు.

ఆంధ్రప్రదేశ్‌ పర్యటన ముగించుకుని ఢిల్లీ వెళుతున్న సందర్భంగా మంగళవారం శంషాబాద్‌ విమానాశ్రయంలో రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ను కలి శారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పార్టీ ముఖ్య నేతలు జానారెడ్డి, భట్టి విక్రమార్క, షబ్బీర్‌అలీ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, మధుయాష్కీ, గూడూరు నారాయణరెడ్డి, హర్కర వేణుగోపాల్‌లతో పాటు తెలంగాణ, ఏపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జు లు కుంతియా, ఉమెన్‌చాందీ, ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షుడు రఘువీరారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాసకృష్ణన్‌లతో ఆయన గంటకు పైగా సమావేశమయ్యారు. జాతీయ, రాష్ట్ర రాజకీయాలపై చర్చించారు.

‘జాబితా’ అవకతవకలను ప్రజల్లోకి తీసుకెళ్లండి
రాష్ట్ర రాజకీయాలతోపాటు ఓటర్ల జాబితాలోని అవకతవకలను రాహుల్‌కు ఉత్తమ్‌ వివరించారు. లక్షల ఓట్లు గల్లంతయ్యాయని, తప్పుల తడకగా ఉన్న జాబితాతోనే ఎన్నికలకు వెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తున్నారని చెప్పారు. ఇదే విషయాన్ని కేంద్ర, రాష్ట్ర ఎన్నికల అధికారులకు అనేకసార్లు వివరించామని.. సుప్రీంకోర్టులోనూ పిటిషన్‌ దాఖలు చేస్తున్నామని చెప్పారు. దీనికి స్పందించిన రాహుల్‌.. టీపీసీసీ న్యాయ పోరాటానికి ఏఐసీసీ మద్దతు ఉంటుందన్నా రు. ఓటర్ల జాబితా విషయంలో ప్రజలను అప్రమత్తం చేయాలని, రాష్ట్ర ప్రభుత్వ దురుద్దేశాన్ని విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.

ఏపీ వ్యవహారాల ఇన్‌చార్జి ఉమెన్‌చాందీ కలగజేసుకుని ఓట్ల జాబితా నుంచి లక్షల మందిని తొలగించి ఎన్నికలు నిర్వహించడం అప్రజాస్వామికమని, దీనిపై నేతలు పోరాడాలన్నారు. రాష్ట్రంలోని కాంగ్రెస్‌ నేతలపై సర్కారు పెడుతున్న కేసుల గురించి కూడా రాహుల్‌కు ఉత్తమ్‌ వివరించారు. కక్ష సాధింపుతో కేసీఆర్‌ వ్యవహరిస్తున్నారని, ఇప్పటికే పలువురు నేతలపై అక్రమంగా కేసులు పెట్టారని, ఇంకొందరిపైనా అదే కుట్ర చేస్తున్నారన్నారు. రాహుల్‌ మాట్లాడుతూ  అక్రమ కేసులను సమర్థంగా ఎదుర్కోవాలని, ఈ విషయంలో పార్టీ శ్రేణులు ఆత్మస్థైర్యం కోల్పోకుండా వ్యవహరించాల్సిన బాధ్యత టీపీసీసీ నేతలదేనని చెప్పారు.

గెలిచే సీట్లు వదులుకోవద్దు
రాష్ట్రంలో ఏర్పాటు చేస్తున్న మహాకూటమి, ఇతర పార్టీలతో పొత్తు అంశాలపైనా భేటీలో చర్చ జరిగింది. పొత్తుల వల్ల గతంలో కాంగ్రెస్‌ నష్టపోయిందని, అర్థవంతమైన పొత్తులుండేలా ముందుకెళ్లాలని ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి చెప్పా రు. దీనికి ఏకీభవించిన రాహుల్‌ గెలిచే సీట్లను త్యాగం చేయాల్సిన అవసరం లేదని ఢిల్లీ సమావేశం లోనే తాను చెప్పానని, వీలున్నంత త్వరగా పొత్తు చర్చలను తుదిదశకు తీసుకొచ్చి ప్రజ ల్లోకి వెళ్లాలని సూచించారు. 2014 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ పక్షాన ప్రజలకు చెప్పుకోకపోవడంతో పాటు చేసింది కూడా చెప్పుకోలేక అధికారం కోల్పోయామని నేతలు అభిప్రాయపడ్డారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top