ప్రధాని మోదీకి ఈసీ మళ్లీ క్లీన్‌చిట్‌

EC gives another clean chit to PM Modi - Sakshi

న్యూఢిల్లీ: ప్రధాని మోదీకి ఈసీ మరోసారి క్లీన్‌చిట్‌ ఇచ్చింది. గుజరాత్‌లోని పటాన్‌లో ఏప్రిల్‌ 21న నిర్వహించిన ప్రచారంలో మోదీ ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించలేదని ఈసీ తేల్చింది. పటాన్‌లోని ఎన్నికల సభలో మోదీ మాట్లాడుతూ.. ఐఏఎఫ్‌ వింగ్‌ కమాండర్‌ను సురక్షితంగా విడుదల చేసేందుకు పాక్‌పై ఒత్తిడి తీసుకొచ్చామన్నారు. కాగా, ముగ్గురు ఎన్నికల కమిషనర్లలో ఒకరు మోదీకి క్లీన్‌చిట్‌ ఇవ్వడాన్ని వ్యతిరేకించినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. అలాగే కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ వయనాడ్‌(కేరళ) నుంచి పోటీ చేయడంపై బీజేపీ చీఫ్‌ అమిత్‌ షా ఏప్రిల్‌ 1న నాగపూర్‌లో చేసిన మెజారిటీ–మైనారిటీ వ్యాఖ్యలపై క్లీన్‌చిట్‌ ఇవ్వడానికి సదరు ఎన్నికల కమిషనర్‌ అంగీకరించలేదని వెల్లడించాయి.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top