కోదండరాం కొత్త పార్టీకి ఈసీ గ్రీన్‌ సిగ్నల్‌ | EC Approves Kodandaram New Party Telangana Jana Samithi | Sakshi
Sakshi News home page

కోదండరాం రాజకీయ పార్టీకి ఈసీ గ్రీన్‌ సిగ్నల్‌

Mar 31 2018 4:48 PM | Updated on Jul 29 2019 2:51 PM

EC Approves Kodandaram New Party Telangana Jana Samithi - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీజేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం ఏర్పాటు చేయనున్న రాజకీయ పార్టీకి ఎన్నికల కమిషన్‌ ఆమోదముద్ర వేసింది. ‘తెలంగాణ జన సమితి’ పేరుతోపాటు ఇతర అనుమతులు లభించాయని శనివారం జేఏసీ వర్గాలు వెల్లడించాయి.

కసరత్తు ముమ్మరం: ఈసీ అనుమతి లభించిన దరిమిలా పార్టీని అధికారికంగా జనం ముందుకు తెచ్చేందుకు టీజేఏసీ సన్నాహాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఏప్రిల్‌ 2న కోదండరాం అధికారిక ప్రకటన చేస్తారని, ఏప్రిల్‌ 4న పార్టీ జెండాను ఆవిష్కరిస్తారని తెలిసింది. తెలంగాణ జన సమితి ఆవిర్భావాన్ని పురస్కరించుకుని ఏప్రిల్‌ 29న భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement