టికెట్‌ ఇవ్వకున్నా టీఆర్‌ఎస్‌లోనే: దానం | Danam Still Has Faith On KCR! | Sakshi
Sakshi News home page

టికెట్‌ ఇవ్వకున్నా టీఆర్‌ఎస్‌లోనే: దానం

Sep 11 2018 2:46 AM | Updated on Mar 18 2019 9:02 PM

Danam Still Has Faith On KCR! - Sakshi

హైదరాబాద్‌: తాను కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ఉద్దేశపూర్వకంగా అసత్య ప్రచా రం జరుగుతోందని, తాను టీఆర్‌ఎస్‌లోనే కొనసాగుతానని మాజీ మంత్రి దానం నాగేందర్‌ స్పష్టం చేశారు. తన నివాసం లో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమా ర్‌రెడ్డిని తాను ఓ హోటల్‌లో కలిసినట్లు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదన్నారు.

టీఆర్‌ఎస్‌ ప్రకటించిన 105 మంది అభ్యర్థుల జాబితా లో తన పేరు లేకపోవడం ఏ మాత్రం బాధించలేదన్నారు. అభ్యర్థుల జాబితా ప్రకటించిన తర్వాత కాంగ్రెస్‌లోనూ అసంతృప్తి రావడం ఖాయమన్నారు. వచ్చే ఎన్నికల్లో హైదరాబాద్‌లో కాంగ్రెస్‌కు డిపాజిట్లు రాకుండా చిత్తుగా ఓడించేందుకు తన వంతు ప్రయత్నం చేస్తానన్నారు. టీఆర్‌ఎస్‌ టికెట్‌ను ఎవరికి ఇచ్చినా వారి గెలుపుకోసం శ్రమిస్తానని వెల్లడించారు.  

Advertisement
 
Advertisement
Advertisement