నిజామాబాద్‌లో అంత మంది పోటీయా!

Contestants In Telangana lok Sabha Polls - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ లోక్‌సభ ఎన్నికల్లో 443 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. నామినేషన్లు దాఖలు చేసిన 503 మందిలో 60 మంది ఉపసంహరించుకోవడంతో చివరకు 443 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్టు ఎన్నికల సంఘం తెలిపింది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుమార్తె కల్వకుంట్ల కవిత పోటీ చేస్తున్న నిజామాబాద్‌ నియోజకవర్గంలో అత్యధికంగా 185 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 189 మంది నామినేషన్‌ వేయగా నలుగురు నామినేషన్లు ఉపసంహరించుకున్నారు. ఈ నలుగురిలో ముగ్గురు రైతులు, మరొకరు స్వతంత్ర అభ్యర్థి ఉన్నారు. సికింద్రాబాద్‌ నుంచి 28 మంది పోటీలో నిలిచారు.

నియోజకవర్గం దాఖలైన నామినేషన్లు ఉపసంహరించుకున్న నామినేషన్లు తుది పోటీలో నిలిచిన అభ్యర్థులు
ఆదిలాబాద్‌ (ఎస్టీ) 13 2 11
పెద్దపెల్లి (ఎస్సీ) 17 0 17
కరీంనగర్‌ 16 1 15
నిజామాబాద్‌ 189 4 185
జహీరాబాద్‌ 18 6 12
మెదక్‌ 18 8 10
మల్కాజ్‌గిరి 13 1 12
సికింద్రబాద్‌ 30 2 28
హైదరాబాద్‌ 19 4 15
చేవెళ్ల 24 1 23
మహబూబ్‌నగర్‌ 12 0 12
నాగర్‌కర్నులు(ఎస్సీ) 12 1 11
నల్లగొండ 31 4 27
భువనగిరి 23 10 13
వరంగల్‌ (ఎస్సీ) 21 6 15
మహబూబాబాద్‌(ఎస్టీ) 18 4 14
ఖమ్మం 29 6 23
మొత్తం 503 60 443

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top