రాష్ట్రాల్లో బీజేపీ ఓటమి: స్పందించిన యోగి! | Congress Won Polls Through Deceit, Says Yogi Adityanath  | Sakshi
Sakshi News home page

Dec 13 2018 4:10 PM | Updated on Dec 13 2018 4:14 PM

Congress Won Polls Through Deceit, Says Yogi Adityanath  - Sakshi

పట్నా: తాజాగా వెలువడిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీకి చేదు అనుభవం ఎదురైన సంగతి తెలిసిందే. అత్యంత కీలకమైన హిందీ మాట్లాడే రాష్ట్రాలు మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌లలో బీజేపీని ఓడించి.. కాంగ్రెస్‌ పార్టీ అధికార పీఠాన్ని సొంతం చేసుకుంది. కాంగ్రెస్‌ పార్టీ విజయాలపై తాజాగా బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్‌, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీ మోసపూరిత హామీలతో గెలించిందని ఆయన అన్నారు. కాంగ్రెస్‌ అబద్ధాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని, దీంతో బీజేపీ భవిష్యత్తు ఎన్నికల్లో లాభపడుతుందని ఆయన చెప్పుకొచ్చారు.

తెలంగాణ సహా, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో యోగి విస్తృతంగా పర్యటించి.. ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయినా, ఆయన ప్రచారం పార్టీకి పెద్దగా లాభించలేదు. ఈ నేపథ్యంలో బుధవారం నేపాల్‌కు వెళ్లి.. జానకీ ఆలయంలో ‘వివాహ పంచమి’ వేడుకల్లో పాల్గొన్న ఆయన.. తిరుగుప్రమాణంలో పట్నాలో ఆగారు. ఈ సందర్భంగా బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌తో భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికలకు సెమీఫైనల్‌ సమరంగా భావిస్తున్న 4 రాష్ట్రాల ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలుపును ఆయన తేలిక చేసి మాట్లాడారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement