కన్నడ కాంగ్రెస్‌ జాబితా విడుదల | Congress releases list of candidates, Siddaramaiah to contest from Chamundeshwari seat | Sakshi
Sakshi News home page

కన్నడ కాంగ్రెస్‌ జాబితా విడుదల

Apr 16 2018 2:29 AM | Updated on Mar 18 2019 9:02 PM

Congress releases list of candidates, Siddaramaiah to contest from Chamundeshwari seat - Sakshi

బెంగళూరు: కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితాను ఆ పార్టీ అధిష్టానం ఆదివారం రాత్రి విడుదల చేసింది. మొత్తం 224 సీట్లకు గానూ.. సీఎం సిద్దరామయ్య, రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షుడు పరమేశ్వరన్‌ సహా 218 మంది పేర్లను ప్రకటించింది. సిట్టింగ్‌ స్థానం వరుణతోపాటు.. చాముండేశ్వరి నియోజకవర్గం నుంచి పోటీచేయాలని సీఎం మొదట నిర్ణయించారు.

అయితే ఈ జాబితా ప్రకారం సిద్దరామయ్య చాముండేశ్వరి నుంచి, ఆయన చిన్న కుమారుడు యతీంద్ర వరుణ నియోజవర్గం నుంచి బరిలో దిగనున్నారు. కొరట్‌గెరె నుంచి గత ఎన్నికల్లో ఓడిన పరమేశ్వరన్‌ మరోసారి ఇక్కడినుంచే పోటీ చేయనున్నారు. ఇటీవలే కాంగ్రెస్‌లో చేరిన వివాదాస్పద వ్యాపారవేత్త అశోక్‌ ఖెనీ బీదర్‌ (దక్షిణం) నుంచి సీటు సంపాదించారు. మల్లికార్జున ఖర్గే కుమారుడు చితాపూర్‌ (ఎస్సీ) నుంచి పోటీ చేయనున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement