పట్టుకోండి చూద్దాం..! | Congress Party Puzzle Game on Narendra Modi in Party Website | Sakshi
Sakshi News home page

పట్టుకోండి చూద్దాం..!

Apr 1 2019 6:50 AM | Updated on Apr 1 2019 6:50 AM

Congress Party Puzzle Game on Narendra Modi in Party Website - Sakshi

పక్క ఫొటో చూశారుగా.. మోదీ ‘మైభీ చౌకీదార్‌’ ప్రచారంపై కాంగ్రెస్‌ రూపొందించిన వ్యంగ్య ట్విట్టర్‌ గేమ్‌లివి. కాంగ్రెస్‌ అధికార ట్విట్టర్‌ హ్యాండిల్‌లో ఆదివారం వీటిని ఉంచారు. మొదటి దాంట్లో ఒకే రూపంలో (చౌకీదార్‌) ఉన్న పలువురి ఫొటోలు ఉన్నాయి. అందులో ఒక ఫొటోలో చౌకీదార్‌కు తెల్లగడ్డం ఉంటుంది. మోదీని పోలి ఉన్న ఆ ఫొటోను గుర్తించడమే ఈ గేమ్‌. ‘పైనున్న వారిలో ఒక్క చౌకీదారే దొంగ. వారెవరో గుర్తు పట్టగలరా’ అని కాంగ్రెస్‌ ట్వీట్‌ చేసింది. ఇక రెండోది ఒక వీడియో. స్లైడ్‌షో రూపం (పక్క ఫొటో)లో ఉన్న దీంట్లో ఊచల వెనుక ఒక దొంగ, వాచ్‌మన్‌ ఒకరివెనుక ఒకరు వస్తూ పోతూ ఉంటారు. దీనికి ‘దొంగను పట్టుకోండి’ అని కేప్షన్‌ పెట్టారు. కాగా, బీజేపీ మైభీ చౌకీదార్‌ నినాదానికి పోటీగా కాంగ్రెస్‌ ‘మైభీ బేరోజ్‌గార్‌’ అన్న నినాదాన్ని ఎత్తుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement