ఒక్కోపార్టీకి 125 సీట్లు

Congress, NCP to contest 125 seats each in Assembly polls - Sakshi

మహారాష్ట్రలో కాంగ్రెస్, ఎన్సీపీ ఒప్పందం

ముంబై: మహారాష్ట్రలో కాంగ్రెస్, నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్సీపీ)ల మధ్య సీట్లు ఖరారయ్యాయి. రాష్ట్రంలో వచ్చేనెలలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్, ఎన్సీపీలు చెరో 125 స్థానాల్లో పోటీ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. 288 స్థానాలున్న మహారాష్ట్రలో మరో 38 స్థానాలను కూటమిలోని ఇతర పార్టీలకు కేటాయించినట్లు ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌ పవార్‌ సోమవారం ట్వీట్‌ చేశారు. ఈ ఎన్నికల్లో ఎన్సీపీ తరఫున కొత్త వ్యక్తులు ఎన్నికల్లో బరిలోకి దిగనున్నారని ఆయన స్పష్టం చేశారు. రెండు పార్టీల మధ్య పలు స్థానాల్లో సీట్ల మార్పు కూడా ఉంటుందని తెలిపారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top