మంజీరాకు నీళ్లు తేకపోతే ఉద్యమిస్తా: జగ్గారెడ్డి  | Congress Leader Jagga Reddy Comments About Manjeera Dam | Sakshi
Sakshi News home page

మంజీరాకు నీళ్లు తేకపోతే ఉద్యమిస్తా: జగ్గారెడ్డి 

May 29 2020 2:43 AM | Updated on May 29 2020 2:43 AM

Congress Leader Jagga Reddy Comments About Manjeera Dam - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మంజీరా డ్యామ్‌కు నీళ్లు తేకుంటే ప్రజా ఉద్యమం చేస్తానని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి పేర్కొన్నారు. గురువారం గాంధీభవన్‌లో సంగారెడ్డి డీసీసీ అధ్యక్షురాలు, ఆయన సతీమణి నిర్మల, కుమార్తె జయారెడ్డితో కలసి మీడియాతో మాట్లాడారు. సంగారెడ్డి నీళ్ల సమస్యపై అనేకసార్లు మీడియా ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లానని, అయినా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. గత మూడేళ్లుగా నీళ్లులేక మంజీరా డ్యామ్‌ బోసిపోయిందని పేర్కొన్నారు. దేశంలో ఎమ్మెల్యేలకు అపాయింట్మెంట్‌ ఇవ్వకుండా పాలిస్తున్న ప్రభుత్వం కేసీఆర్‌దేనన్నారు. నీళ్లు లేకున్నా ఎంపీ, రెండు మున్సిపల్‌ చైర్మన్‌ పదవులను ప్రజలు టీఆర్‌ఎస్‌కే కట్టబెట్టారని పేర్కొన్నారు. కనీస విలువలు లేని వ్యక్తులు కేసీఆర్‌ కేబినెట్‌లో మంత్రులుగా ఉన్నారని విమర్శించారు. వచ్చే నెల 4న తెలంగాణ కాంగ్రెస్‌ బృందంతో మంజీరా డ్యామ్‌ పర్యటన చేపడతామని తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement