‘చెట్ల మీద విస్తరాకుల్లాగా వాగ్దానాలు చేస్తున్నారు’

Congress Leader Dasoju Sravan Kumar Fires On KCR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : మోస పూరితమైన వాగ్దానాలతో ముఖ్యంత్రి కేసీఆర్‌ ప్రజలను మోసం చేస్తున్నారని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్‌ కుమార్‌ ఆరోపించారు. ప్రగతి నివేదన సభలో కటింగ్‌ సెలూన్‌లకు డొమెస్టిక్‌ విద్యుత్‌ టారిఫ్‌ ఇచ్చానని కేసీఆర్‌ అబద్దం చెప్పారంటూ నాయి బ్రాహ్మణులు నిరసన తెలిపారు. గాంధీభవన్‌ ముందున్న గాంధీ విగ్రహం ముందు షేవింగ్‌ చేస్తూ తమ నిరసనను తెలియజేశారు.

నాయి బ్రాహ్మణుల నిరసనకు కాంగ్రెస్‌ మద్దతు ఇచ్చింది. ఈ సందర్భంగా దాసోజు శ్రవణ్‌ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ నాయి బ్రాహ్మణులను మోసం చేశారని ఆరోపించారు. ఇచ్చిన వాగ్దానాన్ని అమలు చేయకుండా చేశానని చెప్పుకోవడం సిగ్గు చేటన్నారు. 250 కోట్లతో నాయి బ్రాహ్మణుల సంక్షేమ నిధి ఏర్పాటు చేస్తానన్న కేసీఆర్‌.. నిధి ఎక్కడ ఏర్పాటు చేశారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి పదవిలో ఉండి వాగ్దానం చేస్తే రాజముద్రగా ఉండాలి కానీ.. కేసీఆర్‌ వాగ్దానాలు చెట్ల మీద విస్తరాకుల్లాగా ఉన్నాయని ఎద్దేవా చేశారు. మోడ్రస్‌ సెలూన్‌లు ఎక్కడ నిర్మించారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top