టీ కాంగ్రెస్‌ ముఖ్యనేతలకు హైకమాండ్‌ పిలుపు

Congress High Command Calls T Congress Leaders To Delhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ ముఖ్యనేతలకు హై కమాండ్‌ నుంచి పిలుపొచ్చింది. టీ కాంగ్రెస్‌ ముఖ్యనేతలతో పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ఢిల్లీలో భేటీ కానున్నారు. కోమటి రెడ్డి సోదరులు, డీకే అరుణతో సహా పలువురు ముఖ్య నేతలు ఢిల్లీకి చేరుకోనున్నారు. గతంలో రాహుల్‌ను కలిసిన సీనియర్లు రాష్ట్ర పరిస్థితులను వివరించారు. పార్టీలో సమన్వయం లోపించిందని రాహుల్‌ గాంధీ దృష్టికి తీసుకెళ్లారు.

కొందరు నేతలు టీడీపీ పొత్తు, సీట్ల కేటాయింపుపై పలు అభ్యంతరాలను లేవనెత్తారు. రాహుల్‌ గాంధీ.. సమన్వయ లోపం, పార్టీలో పెండింగ్‌లో ఉన్న పదవులపై నేతల అభిప్రాయాలను తీసుకోనున్నారు. మొదటి విడతగా 30 నుంచి 40 మంది అభ్యర్థులను ప్రకటించనున్నట్లు సమాచారం. ముందస్తు ఎన్నికలు, తాజా రాజకీయ పరిస్థితులపైనా చర్చ జరగనున్నట్లు సమాచారం. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top