బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు: కాంగ్రెస్‌ | Congress Blames Chandrababu For Bcs Not Getting Judge Posts | Sakshi
Sakshi News home page

బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు: కాంగ్రెస్‌

Apr 25 2018 1:27 PM | Updated on Mar 18 2019 9:02 PM

Congress Blames Chandrababu For Bcs Not Getting Judge Posts - Sakshi

సీఎం చంద్రబాబు నాయుడు

సాక్షి, విజయవాడ : బీసీలకు న్యాయమూర్తి పదవులు రాకుండా అడ్డుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడేనని కాంగ్రెస్‌ పార్టీ ఆరోపించింది. బీసీల పట్ల చంద్రబాబు అనురిస్తున్న వైఖరికి నిరసనగా కాంగ్రెస్‌ నాయకులు మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహం వద్ద బుధవారం ఆందోళనకు దిగారు. బీసీలకు న్యాయమూర్తి పదవులు రాకుండా తప్పుడు నివేదికలు పంపిన చంద్రబాబు వారికి క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచినట్టే.. బీసీలకు చంద్రబాబు వెన్నుపోటు పొడిచారని.. వారిని చంద్రబాబు ఓటు బ్యాంక్‌ రాజకీయాలకు మాత్రమే ఉపయోగించుకుంటున్నారని విమర్శించారు.

బీసీలకు న్యాయం జరిగింది వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే అని తెలిపారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చిన ఘనత వైఎస్‌కే దక్కుతుందన్నారు. బీసీలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది వైఎస్సార్‌ అని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు గుర్తు చేశారు. నిరసన కార్యక్రమంలో జీ గంగాధర్‌, సుంకర పద్మశ్రీతోపాటు ఇతర కాంగ్రెస్‌ నాయకులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement