ఏపీ ప్రజల్నిమోసం చేస్తున్నచంద్రబాబు | chandrababu cheating ap people says ummareddy | Sakshi
Sakshi News home page

ఏపీ ప్రజల్నిమోసం చేస్తున్న చంద్రబాబు

Apr 17 2018 7:49 PM | Updated on Apr 17 2018 8:06 PM

chandrababu cheating ap people says ummareddy - Sakshi

సాక్షి, కర్నూలు : వ్యవసాయం దండగ అన్న సిద్ధాంతాన్ని చంద్రబాబు తన ప్రభుత్వంలో అమలు చేస్తున్నారని వైఎస్సార్‌ సీపీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విమర్శించారు. రైతులందరికీ రుణమాఫీ చేస్తామంటూ ఎన్నికల సమయంలో హామీనిచ్చిన చంద్రబాబు ఇప్పుడా ఊసే ఎత్తడంలేదన్నారు. సిద్దాపురం చెరువు వద్ద నిర్వహించిన వైఎస్సార్‌ గంగా హారతి కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు.

చంద్రబాబు నిర్వాకం వల్ల రుణమాఫీ జరగకపోవడంతో రైతులు మరింత అప్పుల్లో కూరుకుపోయారని ఆరోపించారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వంలో ఏ పంటకూ గిట్టుబాటు ధరలు లేవని ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు ధ్వజమెత్తారు. 

Advertisement
 
Advertisement
Advertisement