రేవంత్‌ రెడ్డిపై ఫిర్యాదు చేసిన హైకోర్టు లాయర్‌

Case Filed Against Revanth Reddy At Jubilee Hills PS - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ నేత రేవంత్‌ రెడ్డిపై జూబ్లిహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో హై కోర్టు న్యాయవాది ఫిర్యాదు చేశారు. జూబీహిల్స్‌లోని కో - ఆపరేటీవ్‌ హౌసింగ్‌ సొసైటీలో ఉన్న ఏడు ఒపెన్‌ ప్లాట్లను, ప్లాట్లుగా చేసి అమ్మేసిన కేసులో రేవంత్‌ రెడ్డిపై చార్జ్‌షీట్‌ దాఖలు చేయకుండా జూబ్లీహిల్స్‌ పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని హై కోర్టు న్యాయవాది రామారావు, రేవంత్‌ రెడ్డిపై, జూబ్లీహిల్స్‌ పోలీసులపై నగర కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీస్‌ అధికారులపై సెక్షన్‌ 166 ఏ కింద చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయంలో పూర్తి స్థాయి విచారణ జరిపి వివరాలను కోర్టుకు నివేదించాల్సిందిగా కమిషనర్‌ను అభ్యర్ధించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top