బీజేపీ స్టార్‌ క్యాంపెయినర్లుగా పీఎం, సీఎం

BJP Shiv Sena Conduct Joint Rallies In Maharashtra - Sakshi

సాక్షి, ముంబై: ఎన్నికలకు సమయం ముంచుకొస్తున్న నేపథ్యంలో బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. పార్టీకి కీలకంగా మారిన రాష్ట్రాల్లో స్టార్‌ క్యాంపెయినర్లను బరిలోకి దించుతోంది. బీజేపీ బలంగా భావించే మహారాష్ట్రాలో బీజేపీ-శివసేన కలిసి పోటీచేస్తోన్న విషయం తెలిసిందే. రెండూ బలమైన పార్టీలు కావడంతో ఎక్కువ సీట్లు సాధించాలని కమలదళం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్‌ను స్టార్‌ క్యాంపెయినర్లుగా బీజేపీ నియమించింది.

వీరితో పాటు హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నావిస్‌ ప్రచారంలో పాల్గొననున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 25 స్ధానాల్లో, శివసేన 23 స్ధానాల్లో పోటీ చేసేందుకు అంగీకారం కుదిరిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా ఆరు భారీ బహిరంగ సభలను నిర్వహించడానికి బీజేపీ షెడ్యూల్‌ను ఖరారు చేసింది. నాగపూర్‌, నాసిక్‌, అమరావతి, నవీ ముంబై వంటి నగరాల్లో భారీ సభలకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం ఏర్పాట్లు చేసింది. వీరితో పాటు ప్రచార సభల్లో శివసేన చీఫ్‌ ఉద్దవ్‌ ఠాక్రే కూడా పాల్గొననున్నారు. కాగా మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ సీట్లలో 50-50 పద్ధతిలో ఇరు పార్టీలు పోటీచేయాలని ఒప్పంద కుదర్చుకున్న విషయం తెలిసిందే.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top