చంద్రబాబు లేఖకు కౌంటర్‌ సిద్ధం చేసిన బీజేపీ | BJP Gets Ready To Counter Chandrababu Naidu Letter | Sakshi
Sakshi News home page

చంద్రబాబు లేఖకు కౌంటర్‌ సిద్ధం చేసిన బీజేపీ

Mar 21 2018 3:06 PM | Updated on Jul 28 2018 3:15 PM

BJP Gets Ready To Counter Chandrababu Naidu Letter - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : టీడీపీ అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖకు భారతీయ జనతా పార్టీ కౌంటర్‌ సిద్ధం చేసింది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా రేపు (గురువారం) ఆ లేఖను విడుదల చేసే అవకాశం ఉంది. చంద్రబాబు చేసిన ప్రతి ఆరోపణకు లేఖలో సమాధానం ఇవ్వాలని బీజేపీ నిర్ణయించింది. మిత్ర ధర్మాన్ని టీడీపీ ఎలా విస్మరించిందో... బీజేపీని ఎలా ద్రోహం చేసిందో ఆ లేఖలో అమిత్‌ షా ప్రస్తావించనున్నారు. ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్‌కు కేంద్ర ప్రభుత్వం చేసిన సాయం, భవిష్యత్‌లో చేయబోయే సాయాన్ని ఆ లేఖలో వివరించనున్నారు. అలాగే ప‍్రత్యేక హోదాపై చంద్రబాబు వైఖరి...మాట మార్చిన తీరును అమిత్‌ షా ఎండగట్టనున్నారు.

కాగా చంద్రబాబు నాయుడు కొద్దిరోజుల క్రితం అమిత్‌ షా కు లేఖ రాసిన విషయం తెలిసిందే. ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు రావడానికి గల కారణాలను ఆయన ఆ లేఖలో వివరించారు. రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించడం వల్ల 5 కోట్ల మంది ప్రజలు రోడ్డున పడ్డారని.. ఎన్డీయే ప్రభుత్వం రాష్ట్రానికి ఏదైనా చేస్తుందని ఎన్నో ఆశలతో వేచి చూశామని..  కానీ ఏమి చేయలేదని,  హామీల అమలులో బీజేపీ ఎంతమాత్రం చిత్తశుద్ధి చూపించలేదంటూ అందుకే తప్పని పరిస్థితుల్లో ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని అమిత్ షాకు చంద్రబబు ఆ లేఖలో పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement