రెచ్చిపోయిన అఖిలప్రియ బంధువులు! | Bhuma Akhila Priya Relatives Attacks YSRCP Leaders | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ నేతలపై అఖిలప్రియ బంధువుల దాడి

May 30 2018 10:09 AM | Updated on Aug 10 2018 9:52 PM

Bhuma Akhila Priya Relatives Attacks YSRCP Leaders - Sakshi

సాక్షి, కర్నూలు : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు, కార్యకర్తలపై అధికార టీడీపీ వర్గీయుల దాడులు రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. అలాంటి ఘటనే తాజాగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో చోటుచేసుకుంది. ఆ వివరాలిలా.. వైఎస్సార్‌సీపీ వర్గీయులపై మంత్రి అఖిలప్రియ బంధువులు దాడికి పాల్పడ్డారు. పొలం పంచాయితీ ఉందని మాట్లాడటానికి రావాలంటూ వైఎస్సార్‌సీపీ నేతలు కేఈ శ్రీనివాస్ గౌడ్‌ను, అతడి సోదరులను కొందరు టీడీపీ నేతలు పిలిపించారు. వైఎస్సార్‌సీపీ నేతలు వారు చెప్పిన చోటుకు రాగానే టీడీపీ వర్గీయులు కర్రలు, కత్తులతో దాడికి పాల్పడ్డారు. 

టీడీపీ నేతల దాడిలో తీవ్రంగా గాయపడ్డ కేఈ శ్రీనివాస్‌ గౌడ్‌ అతడి సోదరులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. బాధితులు మీడియాతో మాట్లాడుతూ.. దొర్నిపాడు మండలం కొత్తపల్లెకు చెందిన భూమా బ్రహ్మం, అతడి కుమారులు సహా మరో 20 మంది తమపై విచక్షణా రహితంగా దాడి చేశారని ఆరోపించారు. పాత కక్షలు ఉండటం, దాంతో తాము అధికారంలో ఉన్నామని టీడీపీ శ్రేణులు దాడి చేశాయని కేఈ శ్రీనివాస్‌ సన్నిహితులు వాపోయారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement