‘ఓట్లు అడిగే హక్కు నాకు మాత్రమే ఉంది’ | Bhatti Vikramarka Mallu Road Show In Madhira | Sakshi
Sakshi News home page

‘ఓట్లు అడిగే హక్కు నాకు మాత్రమే ఉంది’

Dec 1 2018 2:40 PM | Updated on Mar 18 2019 9:02 PM

Bhatti Vikramarka Mallu Road Show In Madhira - Sakshi

సాక్షి, మధిర : మధిర నియోజకవర్గ ప్రజలను ఓటు వేయమని అడిగే హక్కు తనకు తప్ప మరెవరికీ లేదని కాంగ్రెస్‌ పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌ మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతితో కలిసి భట్టి రోడ్‌ షో నిర్వహించారు. ఈ సందర్భంగా సిరిపురం గ్రామంలో మాట్లాడుతూ.. జాలిముడి ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడంలో తాను విశేష కృషి చేశానన్నారు. ఈ ప్రాజెక్టులో భాగంగా సిరిపురంలో తీసిన కాలువ గ్రామానికి ఒక మణిహారంలా మారిందని హర్షం వ్యక్తం చేశారు. ప్రజల గురించి పట్టించుకోని కొందరు నాయకులు ఎన్నికలు వచ్చే సరికి డబ్బు మూటలతో సిద్ధమైపోయారని విమర్శించారు. నాలుగు పార్టీలు మారిన వాళ్లు ప్రజలు కూడా తమలాగే అమ్ముడుపోతారనే భ్రమలో ఉన్నారని..అటువంటి వారికి సరైన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. అసలు వారికి ఓట్లు అడిగే హక్కు ఉందా అని ప్రశ్నించారు.

కాగా ఈ రోడ్‌ షోలో భట్టితో పాటు విజయశాంతి, ప్రజాయుద్ధనౌక గద్దర్‌, మధిర తెలుగుదేశం పార్టీ ఇంచార్జి వాసిరెడ్డి రస్మనాథం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement