‘పవన్‌ పార్ట్‌ టైమ్‌ లీడర్‌గా మారారు’ | Sakshi
Sakshi News home page

‘పవన్‌ పార్ట్‌ టైమ్‌ లీడర్‌గా మారారు’

Published Sat, Jan 18 2020 2:51 PM

BC Unity Forum President Buddha Nageswara Rao Criticises Chandrababu - Sakshi

సాక్షి, విజయవాడ :  అధికారంలోకి వచ్చిన ఏడు నెలల్లోనే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 80 శాతం అమలు చేశారని  బీసీ ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు బుద్దా నాగేశ్వరరావు అన్నారు. శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. టీడీపీ 2014ఎన్నికల్లో ఇచ్చిన  వాగ్దానాలు అమలు చేయడంలో పూర్తిగా విషలమైందని విమర్శించారు. రాష్ట్రంలో 4 లక్షలకు పైగా ఉద్యోగాలు ఇచ్చి యువతకు సీఎం జగన్‌ భరోసా కల్పించారన్నారు. రైతులకు రుణమాఫీ చేసిన ఘనత ఆనాడు వైయస్సార్‌ది అయితే ఈనాడు రాష్ట్ర రైతులు ఆర్ధికంగా నిలదొక్కుకునేలా రైతు భరోసా తెచ్చిన ఘనత సీఎం వైఎస్‌ జగన్‌ది అన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ రాషష్టట్రానికి అవసరమన్నారు. చంద్రబాబు ఒక్క హైదరాబాద్‌ను మాత్రమే అబివృద్ది చేయడంతోనే తెలంగాణ వాదం పుట్టిందని, రాష్ట్ర విభజనకు చంద్రబాబు లేఖ ఇవ్వలేదా అని ప్రశ్నించారు. (ఇక మధ్యాహ్న భోజన పథకంలో నూతన మెనూ)

చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అంతా తాత్కాలికం అంటూ కాలయాపన చేశారని విమర్శించారు.  కార్పోరేట్‌ కంపెనీలకు, తమ అనుకూల వర్గం కోసం ఇన్‌సైడ్ ట్రెడింగ్‌కు పాల్పడ్డారని మండిపడ్డారు. సీఎం జగన్‌ రైతు పక్షపాతి అని, రైతులకు అన్యాయం జరగనివ్వరని భరోసా ఇచ్చారు. చంద్రబాబు రాజకీయ నిరుద్యోగిగా మారీ అలజడి సృష్టిస్తున్నారని, చంద్రబాబు ఐదేళ్లలో అమరావతి అబివృద్ది చేయకపోగా రాషష్టట్రీఆన్ని అప్పుల ఉబిలో నెట్టారని దుయ్యబట్టారు. గడిచిన ఐదేళ్ల పాలనలో కార్పోరేట్లకు కొమ్ము కాసిన తెలుగుదేశం పార్టీని పవన్ కళ్యాణ్ ఒక్క మాట కూడ అనలేదన్నారు. తెలుగుదేశం బినామీ, షాడో పార్టీగా జనసేన వ్యవహరిస్తోందన్నారు. తెలుగుదేశం ముసుగులో పవన్ కళ్యాణ్  బీజేపీతో కలిశారని ఆరోపించారు. సొంత వ్యక్తిత్వం లేని వ్యక్తి పవన్ కళ్యాణ్  అని, పార్ట్ టైమ్ లీడర్‌గా ఆయన వ్యవహరిస్తున్నారని వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement